తెలంగాణ పోలీసులకి సెల్యూట్ కొట్టిన హీరో

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. తమ ప్రాణాలకి ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా విధులు నిర్వహించడం గొప్ప విషయం. వారి కష్టాన్ని గుర్తించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకటికి రెండు సార్లు వారికి కృతజ్ఝతలు చెప్పారు. చేతులెత్తి మొక్కారు. వారికి ప్రోత్సాహకంగా సీఎ కానుక కింద జీతంలో 10శాతం బోనస్ ప్రకటించారు.

తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తెలంగాణ పోలీసులకి సెల్యూట్ కొట్టారు. ఈ మేరకు ఆయన ఓ వీడియాని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇటీవల నిత్యావసర వస్తువులు కొనేందుకు బయటికి వెళ్లినప్పుడు పోలీసుల పనితీరుని గమనించా. చాలా బాగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి కృతజ్ఝతలు. తెలంగాణ పోలీసులకి సెల్యూట్ కొడుతున్నానన్నారు చైతూ.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ-సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమా తెరకెక్కుతోంది. మజిలీ తర్వాత చైతూ నటిస్తున్న చిత్రమిది. లవ్ స్టోరీలు చైతూకి బాగా సూటవుతాయి. ఆయన సెక్సెస్ కొట్టిన కథలన్నీ లవ్ స్టోరీలే. లవ్ స్టోరీ కూడా చైతూకి మంచి హిట్ ఇస్తుందని ఆశిద్దాం.