తెలంగాణ పోలీసులకి మహేష్ సెల్యూట్

కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన పోలీసులు, వైద్యులు, స్వచ్ఛ కార్మికులు తదితరులు విధులు నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడి కోసం తెలంగాణ పోలీసులు కష్టపడుతున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఓ వైపు కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడంతో పాటు.. లాక్‌డౌన్‌ అమలులో వారి కృషి అభినందనీయం.

తెలంగాణ పోలీసుల పనితీరు టాలీవుడ్ హీరోలని సైతం ఫిదా చేసింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణ పోలీసుల పనితీరుపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. వారికి సెల్యూట్ చేశారు. నాగ చైతన్య అక్కినేని సైతం తెలంగాణ పోలీసులకి సెల్యూట్ అంటూ ట్విట్ చేశారు.