ఆచార్యలో అతిథి పాత్రలో నిహారిక ?

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఏ చిన్ని పాత్ర దొరికిన అదృష్టంగా భావిస్తుంటారు నటీనటులు. ఇందుకు మెగా ఫ్యామిలీ మినహాయింపు ఏమీ కాదు. మెగాస్టార్ సినిమాలో కనిపించాలని మెగా హీరోలందరు ఆశపడినవారే. అందుకోసం ట్రై చేసినవారే. అయితే మెగా హీరోయిన్ నిహారికకి మాత్రం ఆ కోరికని సైరాతో తీర్చుకుంది.

సైరాలో నిహారిక బోయ అమ్మాయిగా చిన్ని పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి పెదనాన్న సినిమాలో కనిపించాలని నిహారిక చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో నిహారిక అతిథి పాత్రలో మెరవనున్నట్టు సమాచారమ్. ఇప్పటి వరకు మాత్రం ఇది గాసిప్పే. ఈ గాసిప్ నిజమవుతుందా ? అన్నది చూడాలి.