పవన్ కి హనుమ భక్తిని అలవాటు చేసిన చిరు
హనుమంతునిపై భక్తి అన్నయ్య ద్వారానే వచ్చిందన్నారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఏప్రిల్ 8తో తనకి ఓ మధుర జ్ఝాపకం ఉందన్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ జ్ఝాపకాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న సంగతి తెలిసిందే. ‘చిన్నప్పుడు లాటరీలో వచ్చిన ఆంజనేయుని బొమ్మని నా చేతిలో చూసిన మా నాన్న ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి’ అన్నారు. అందుకే బొమ్మని అప్పటి నుంచి ఇప్పటి దాకా నా దగ్గర అలాగే భద్రంగా దాచుకొన్నానని చిరు తెలిపారు.
అన్నయ్య మధుర జ్జాపకంపై తాజాగా పవన్ స్పందించారు. “హనుమంతునిపై భక్తి అన్న ద్వారానే వచ్చింది. నాస్తికుడు, కమ్యూనిస్టు నుంచి రాముని పూజించే వరకు వచ్చారు మా నాన్న .ఆయన ద్వారా అన్నకు.. అన్న ద్వారా నాకు భక్తి అబ్బింది. చిన్నపుడు నేను ఎన్నో సార్లు హనుమాన్ చాలీసా చదివాను. 108 సార్లు పఠించాను” అని పవన్ తెలిపారు.
Hanumanji worship came into our home through my brother-Chiranjeevi garu; & that made my father to transform from an atheist& communist to Lord Rama Devotee. I used to recite Chalisa 108 times in certain days of my teen age.Jai Hanuman!🙏 https://t.co/5Kh0oWjnGp
— Pawan Kalyan (@PawanKalyan) April 9, 2020