ధోని కంటే గంభీర్ బెస్ట్ : ఉతప్ప

టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరు ? అత్యధికులు చెప్పే సమాధానం మహేంద్ర సింగ్ ధోని. తాజా, మాజీ క్రికెటర్లు ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. కానీ ఉతప్ప మాత్రం అందుకు భిన్నంగా ధోని కంటే గంభీర్ బెస్ట్ అనేశాడు. రాహుల్ ద్రావిడ్, ధోని, గంభీర్ (ఐపీఎల్) కెప్టెన్సీలలో ఉతప్ప ఆడిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురిలో మీ ఫెవరేట్ కెప్టెన్ ఎవరు ? అని ఉతప్పని అడగగా.. గంభీర్ అని సమాధానిమిచ్చాడు.

‘గౌతమ్ గంభీర్ నా ఫేవరెట్ కెప్టెన్. గ్రౌండ్ లో అతను ఎక్కువగా మాట్లాడడు. కానీ.. ఎవరికి.. ఎంత చెప్పాలో అంతే చెప్తాడు. గంభీర్‌ లాంటి మంచి కెప్టెన్ ఉంటే..? టీం అంత ధైర్యంగా ఉండవచ్చు. అలాగే ఐపీఎల్‌లో గంభీర్ కెప్టెన్సీలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో మన అందరికి తెలుసు. అతని కెప్టెన్సీ లో  కోల్‌కత నైట్ రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది’’ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.