థియేటర్స్ జూన్ వరకు బంద్ ?

కరోనా కట్టడి కోసం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత కూడా పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఝప్తి చేస్తున్నారు. మరో నెలరోజులు అంటే మే 15 వరకు  లాక్ డౌన్ పొడగించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.

ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేసినా విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, సాముహిక మత ప్రార్ధనల ఆంక్షలు విధించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్స్ తెరచుకొనే అవకాశాలే లేవని చెబుతున్నారు. జూన్ వరకు థియేటర్స్ మూతపడే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలని ఆన్ లైన్ లో రిలీజ్ చేసి సొమ్ము చేసుకొనే విషయంపై నిర్మాతలు ఫోకస్ చేస్తున్నట్టు సమాచారమ్.