ట్రంప్ ప్రతీకారం.. ప్రేమగా మారింది !
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు భారత్ పై ప్రతీకార మాటలు మాట్లాడిన సంగతి తెలిసిందే. కరోనా చికిత్సకు ఉపయోగపడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై భారత్ నిషేధం ఎత్తివేయకపోతే.. తాను డిసపాయింట్ అవుతాను. అంతేకాదు భారత్ పై ప్రతీకార చర్యలు కూడా ఉంటాయని ట్రంప్ ప్రకటించారు.
కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన భారత్ పంతానికి పోకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై ఆంక్షలు ఎత్తేసింది. దీంతో ట్రంప్ ఖుషి అయ్యాడు. భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మోదీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. భారత్ చేసిన సాయాన్ని గుర్తుంచుకుంటామన్నారు. ఈ మేరకు ట్రంప్ ట్విట్ చేశారు. మొత్తానికి ట్రంప్ ప్రతీకార కామెంట్స్ ని భారత్ ప్రేమగా మలుచుకోగలిగింది. అదే భారత్ గొప్పతనం.