వారికి జగన్ సెల్యూట్

కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దీంతో పరిస్థితులు అదుపులోనికి వస్తున్నాయి. శుక్రవారం సీఎం జగన్ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, కొవిడ్‌ ఆసుపత్రుల వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, పారిశుద్ధ్య సిబ్బందిని అభినందించారు.

కరోనాపై యుద్ధంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. రిస్క్‌ ఉంటుందని తెలిసీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. భయం ఉన్నా వైద్య సేవలు అందిస్తున్నందుకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు సీఎం జగన్.

దిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. వారందరినీ గుర్తించి క్వారంటైన్‌, ఐసోలేషన్‌లో ఉంచాం. మొత్తం మీద పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నానని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.