28యేళ్ల ఘరానా జ్ఝాపకాలు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ‘ఘరానామొగుడు’. ఈ చిత్రం 1992లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. గురువారం నాటికి ఈ సినిమా విడుదలై 28 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా చిరుతో కలిసి దిగిన ఫోటోని రాఘవేంద్రరావు ట్విటర్‌ లో షేర్ చేశారు. ఘరానా జ్ఝాపకాలని పంచుకున్నారు.

‘కాలం వేగంగా గడిచిపోతున్నప్పటికీ నా బాబాయ్‌తో కలిసి ఈ సినిమా చిత్రీకరించిన రోజులు ఎప్పటికీ నాకు గుర్తుండిపోతాయి. ఇది ఒక మెగా స్పెషల్‌ ఫిల్మ్‌. ఇది ఒక మైలురాయి చిత్రం. ‘ఘరానామొగుడు’ చిత్రం విడుదలై 28 సంవత్సరాలు పూర్తయ్యాయి. చిత్ర నిర్మాత దేవి వరప్రసాద్‌, సంగీత దర్శకుడు కీరవాణి, చిత్రబృందానికి థ్యాంక్యూ’ అని రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు. దీనికి చిరంజీవి రిప్లై ఇచ్చారు.

“ఘరానామొగుడు’ సృష్టించిన ఘనత మీదే రాఘవేంద్రరావు గారు. ఈ చిత్రం సృష్టించిన రికార్డుల కంటే మీతో పనిచేసిన ప్రతిరోజూ నాకో మంచి జ్ఞాపకం. నటీనటులను పువ్వుల్లో.. ఒక్కోసారి పళ్లల్లో పెట్టి చూసుకుంటూ మంచి ఫలితాన్ని రాబట్టుకున్న ఘరానా దర్శకుడు మీరు. కీరవాణి, నిర్మాత దేవీ వరప్రసాద్‌ ఈ విజయానికి మూలస్తంభాలు” అని రాసుకొచ్చారు.