తెలంగాణలోనూ మాస్కులు మస్ట్

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ లని తప్పనిసరి చేస్తూ ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో తెలంగాణ ప్రభుత్వం కూడా చేరిండి. మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. 

చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు ఉండటంలేదంటూ ఓ అధ్యయనంలో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇటీవల నిజామాబాద్ లో ఓ యువకుడిలో కరోనా లక్షణాలు లేకున్నా.. అతడికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మాస్క్ లని ధరించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.