ఎస్‌ఈసీ తొలగింపుపై పవన్ రియాక్షన్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయ్. దీనిపై స్పందించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇది కచ్చితంగా కక్ష సాధింపు చర్యనే అన్నారు. ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘ఎన్నికల కమిషనర్‌ను తొలగించడానికి ఇదా సమయం? ఓ వైపు కరోనాతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రభుత్వం తన శక్తి సామర్థ్యాలను ప్రజలను కాపాడటంపై కేంద్రీకరించారు. ఇందుకు భిన్నంగా ప్రభుత్వంలోని పెద్దలు ఇలా కక్ష తీర్చుకునే కార్యక్రమంలో మునిగిపోయారు. కరోనా పడగ విప్పుతున్న సమయాన ఎన్నికలు నిర్వహించి ఉంటే ప్రజల ప్రాణాలు ఎంతటి ప్రమాదంలో పడి ఉండేవో ఊహించగలమా?’ అంటూ పవన్ ప్రశ్నించారు.