లాక్‌డౌన్ పొడగింపు ప్రకటన రేపే
దేశంలో కరోనా కట్టడి కోసం మార్చి 25న ప్రధాని ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ మంగళవారం (ఏప్రిల్ 14)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. దానికి సంబంధించిన ముహూర్తం కూడా ఫిక్సయినట్టు సమాచారమ్. రేపే (శనివారం) ప్రధాని ప్రసంగం ఉంటుందని తెలుస్తోంది.
రేపు ప్రధాని మోడీ ముందుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతారని.. ఆ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. లాక్‌డౌన్ ని మరింతకాలం పొడిగించాలని తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక సహా అనేక రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కేంద్రం కూడా లాక్‌డౌన్ ని పొడిగించాలనే ఆలోచనతోనే ఉంది. రేపటి ప్రధాని ప్రసంగంలో లాక్‌డౌన్ పై ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.
అయితే ఈ సారి లాక్‌డౌన్ పొడగింపు సందర్భంగా కొన్ని రంగాలకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. దేశంలో 75 జిల్లాల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో అధికారులు వాటిపై ఎక్కువగా దృష్టిపెట్టనున్నారు. లాక్‌డౌన్ పొడగింపు సందర్%B