పవన్ హీరోయిన్ క్లాసిక్ పోజులు


హీరోయిన్ ప్రణీత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కానీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆమెకి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఈ సినిమాతో ప్రణీతపై పవన్ హీరోయిన్ అనే ముద్రపడిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

కరోనా ప్రభావంతో సినీతారలు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇంట్లో నచ్చిన పని చేసుకుంటున్నారు. వాటి సంబంధించిన ఫోటోలు, వీడియోలని అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ప్రణీతకి సంబంధించిన ఫోటో షూట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రణీత క్లాసిక్ లుక్ లో ఆకట్టుకుంటోంది. వాటిని మీరు చూసేయండీ.. !