ఐపీఎల్ రద్దయినట్టే ?

ఈ యేడాది ఐపీఎల్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ సీజన్ 13 కరోనా ప్రభావంతో ఏప్రిల్ 15కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 14 తర్వాత కూడా దేశంలో లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యేడాది ఐపీఎల్ రద్దయినట్టేనని చెప్పుకొంటున్నారు. ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ రాజీవ్‌శుక్లా కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తాజా పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా ఐపీఎల్ నిర్వహణపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘ఐపీఎల్‌ నిర్వహణపై ఎలాంటి ఏర్పాట్లు జరగడం లేదు. ప్రభుత్వ నిర్ణయం మీదే అది ఆధారపడి ఉంది. అందుకు తగ్గట్లే నడుచుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం ఉందనే వార్తలు వింటున్నాం. ఒకవేళ ఏప్రిల్‌ 15న ఐపీఎల్‌ ప్రారంభమవుతుందని మీరు అనుకుంటే.. అలా కనిపించడం లేదు’ అన్నారు.