మాస్క్ ధరించకుంటే రూ. 1000 జరిమానా
ప్రపంచ దేశాలని వణికిస్తున్న కరోనా వైరస్ కి మందు లేదు. ముందస్తు జాగ్రత్తలే శరణ్యం. సామాజిక దూరం, శుభ్రత, భయటికి వెళ్లినప్పుడు మొహానికి మాస్క్ ధరించడం ద్వారా కరోనాని మన దరికి చేరకుండా జాగ్రత్తపడవచ్చు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాస్క్ ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసేంది. పూణేలో మాస్క్ ధరించిన ఏడుగురిపై ఏకంగా పోలీస్ కేసులు నమోదు చేశారు.
తాజాగా గుంటూరులోనూ మాస్క్ ని మస్ట్ చేశారు. తప్పకుండా మాస్కును ధరించాల్సిందే. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా వస్తే రూ.వెయ్యి వరకు అధికారులు జరిమానా విధించనున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.