చైనాపై అమెరికా ప్రతీకార చర్య

కరోనా వైరస్ ని చైనా వైరస్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఎలా బయటికొచ్చింది అనే విషయంలోనూ అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు చైనాని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌పై సరైన సమాచారం ఇవ్వలేదని చైనాపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

తాజాగా ఆ దేశంపై  ప్రతీకార చర్యలకు పూనుకుంది. ‘చైనా టెలికాం వల్ల దేశ రక్షణ, భద్రత, ఆర్థిక, న్యాయ వ్యవస్థకు ముప్పుందని అధికార వర్గాలు గుర్తించాయి. ప్రజాప్రయోజనార్థం ఆ సంస్థ లైసెన్సులను ఎఫ్‌సీసీ రద్దు చేయాలి’ అని అమెరికా న్యాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.