మాట నిలబెట్టుకున్నావ్ బ్రదర్.. థమన్ పై బన్నీ ప్రశంసలు !
త్రివిక్రమ్ మాట, థమన్ పాట, అల్లు అర్జున్ యాక్షన్.. ఓ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. ఫస్ట్ లుక్ నుంచి సినిమా 100డేస్ ఫంక్షన్ దాటిన తర్వాత కూడా రికార్డులు సృష్టించిందీ.. ఈ సినిమా. ఇక అల.. పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టన్నుల కొద్ది వ్యూస్. లెక్కలేనన్నీ రికార్డ్స్ సృష్టించాయి. ఇప్పుడు అల.. పాటల వ్యూస్ ఏకంగా 100కోట్ల వ్యూస్ దాటిపోయాయ్. దీనిపై బన్నీ ఆనందం వ్యక్తం చేశారు. థమన్ పై ప్రశంసలు కురిపించారు.
“తమన్ నేను చాలా గర్వంగా ఫీలవుతున్నా. నువ్వు నాకిచ్చిన మాటను నిలబెట్టుకున్నావు. ఈ సినిమా పాటలు వంద కోట్ల వ్యూస్ రాబట్టాలని నిన్ను అడిగాను. ‘తప్పుకుండా బ్రదర్.. నీకు మాటిస్తున్నా’నని చెప్పావు. ఈ రోజు 1.13 వంద కోట్ల వ్యూస్ వచ్చాయి. నీ మాటను నిలబెట్టుకున్నావు. ధన్యవాదాలు బ్రదర్’ అని బన్నీ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన థమన్ ‘ఈ ట్వీట్‌ను నా జీవితాంతం గుర్తుంచుకుంటాను బ్రదర్’ అని సమాధానం ఇచ్చారు.
Will save this tweet for life brother ♥️#avplalbum
https://t.co/aE6jiULiHL
— thaman S (@MusicThaman) April 11, 2020