‘వి’ సినిమాకి అమెజాన్ ప్రైమ్ రూ. 35కోట్ల ఆఫర్
కరోనా ప్రభావంతో దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో సినిమా షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయ్. ఈ నేపథ్యంలో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలపై భారం పడుతోంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రిలీక్ కావాల్సిన సినిమాలన్నీ డిజిటల్ ఫార్మెట్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’, రామ్ ‘రెడ్’ సినిమాలు ఆన్ లైన్ లో రిలీజ్ కాబోతున్నాయనే కామెంట్స్ వినిపించాయి. అదేం లేదంటూ సదరు చిత్రబృందాలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాయి.
తాజా వి సినిమాపై కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. వి సినిమాకి అమెజాన్ ప్రైమ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా రూ. 35కోట్లకి కొనుగోలు చేసేందుకు రెడీ అయిందనే న్యూస్ బయటికొచ్చింది. డీల్ కుదిరిందా.. ? ఇంకా చర్చలు మాత్రమే జరుగుతున్నాయా ? అన్న విషయంలో స్పష్టత లేదు. ఈ నెల 14 తర్వాత కూడా మరో రెండు వారాల పాటు అంటే ఈ నెల 30వరకు లాక్ డౌన్ పొడగించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా.. ఆ వెంటనే థియేటర్స్ తెరుచుకొనే పరిస్తితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అమెజాన్ ఆఫర్ ని ఓకే చేస్తేనే బాగుంటుందేమో అనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు సమాచారమ్.
ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, నాని కథానాయకులుగా ‘వి’ తెరకెక్కింది. నివేదా థామస్, అతిథి రావు హైదరి కథానాయికలు. ఇందులో నాని రాక్షసుడుగా, సుధీర్ బాబు రక్షకుడుగా కనిపిస్తారని ప్రచార చిత్రాల్లో చూపించారు. అయితే ఈ రెండు పాత్రల వెనక అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉంటుందని సమాచారమ్.