కరీనా బీచ్ అందాలు కొత్తగా !

కరోనా ప్రభావంతో దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో సినిమా షూటింగ్స్, థియేటర్స్ బంద్ అయ్యాయ్. ఈ నేపథ్యంలో సినీ తారలు ఇంటికే పరిమితమయ్యారు. తమకి నచ్చిన పనులు చేసుకొంటున్నారు. కొత్త పనులు చేస్తున్నారు. మరికొద్దరు పాత మధురజ్జాపకాలని కొత్తగా గుర్తు చేసుకొంటూ.. వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఇదే చేసింది. ఓ పాత ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. గతంలో ఓ బీచ్‌లో భర్త సైఫ్ అలీఖాన్, కొడుకు తైమూర్‌తో కలిసి సేద తీరుతున్న ఫోటో అది. ఇందులో కరీనా హాట్ హాట్ బికినీలో ఉంది. ‘తాను బీచ్ ల కోసం కలలు కనడం లేదు. మరీ మీరూ.. అంటూ’ కామెంట్ చేసింది. కరీనా కామెంట్ కన్నా.. ఫోటోలో ఆమె చూపించిన గ్లామర్ నే హైలైట్ అయింది.