లాక్ డౌన్ ఎఫెక్ట్ .. సినిమా టికెట్ రేట్లు తగ్గించాల్సిందే !
కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ అన్నీరంగాలు అతలాకుతలం అవుతున్నాయి. తిరిగి నిలబడాలంటే చాలా సమయమే పడుతోంది. పరిశ్రమల వరకు ఎందుకు సాధారణ మానవుడు కోలుకొనేందుకు కొన్ని నెలల సమయం పట్టేలా ఉంది. లాక్‌డౌన్ ఎఫెక్ట్ తో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. జీతాలు సరిగ్గా రావడం లేదు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తేసినా వెంటనే జనాలు థియేటర్స్ కి వచ్చే పరిస్థితులు కనబడటం లేదు. పైగా లాక్‌డౌన్ తో వచ్చిన సెలవుల్లో జనాలు డిజిటల్ ఫార్మెట్ కి బాగా అలవాటు పడిపోయారు.
ఈ నేపథ్యంలో ప్రేక్షకుడ్ని మళ్లీ థియేటర్లవైపు నడిపించడం చాలా కష్టం. చిత్రసీమకు అదే అది పెద్ద సవాల్. దాన్ని స్వీకరించాలి కూడా. టికెట్టు రేట్లు తగ్గించడం ఓ ప్రధాన మార్గం. కనీసం తాత్కాలికంగానైనా రేట్లు తగ్గించాలి. లేదంటే.. థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరగదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మల్టీప్లెక్స్ లో టికెట్ 150 రూపాయలు. దాన్ని 100కి కుదించే అవకాశాలు లేకపోలేదు. సింగిల్ స్క్రీన్ విషయంలోనూ ఇంతే దాదాపు 40 శాతం రేట్లు తగ్గించే ఛాన్సుందని చెబుతున్నారు.