ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్.. వీటికి మాత్రమే మినహాంపు !

ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. 30వ తేదీ వరకు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామన్నారు. కేంద్రం నిర్ణయం కూడా. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రావొచ్చు అన్నారు సీఎం కేసీఆర్. దాంతో పాటు కేంద్రం ఏదైనా ప్యాకేజీలు ప్రకటిస్తారేమోనని ఆకాంక్షించారు.

ఇక లాక్ డౌన్ నుంచి కొన్ని రంగాలకి మినహాయింపుని ఇచ్చారు సీఎం కేసీఆర్. రైతులకి మినహాయింపు ఉంటుంది. వాళ్లు పంటలు పండిస్తేనే మన కడుపులు నిండుతాయి. 135కోట్ల జనభా ఉన్న మనదేశానికి తిండిపెట్టే సత్తా ఇతర దేశాలకి లేదు. ఆహారం విషయంలో మనం స్వాలంభనంగా ఉన్నాం. ఇదే విషయాన్ని ప్రధాని మోడీకి కూడా చెప్పాను. ఆహార పంటలని మనం పండించుకోవాలన్నారు. ఇక  ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులకి మాత్రం పరీక్షలు నిర్వహిస్తామన్నారు.