అందుకే అలియాని తీసుకున్నాం:రాజమౌళి


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్య ఉన్న ఓ కామన్ పాయింట్ ఆధారంగా ఈ కథని రెడీ చేశారు రాజమౌళి. అదేంటీ ? అన్నది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే దానికి ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి సమాధానం చెప్పారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ప్రతిభావంతుల మధ్య వారికి దీటుగా నిలిచే నటి కావాలనుకున్నాం. అమాయకంగా ఉంటూనే, తెగువ ప్రదర్శించగల అమ్మాయిగా అలియా సరిగ్గా సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేశామని రాజమౌళి చెప్పారు.

వాస్తవానికి ఈ నెలలో అలియాపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. లాక్ డౌన్ తో రీషెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చింది. అలియాతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని రాజమౌళి తెలిపారు. ఇక ఈ సినిమా కోసం అలియా రోజుకో రూ. 50లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందని.. ఆమె ఆర్ ఆర్ ఆర్ కోసం 10రోజుల కాల్షీట్లు ఇచ్చింది. దీంతో ఆమెకి రూ. 5కోట్ల పారితోషికం ఉంటనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే యేడాది జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.