ఒక్కోక్కరికి మూడు మాస్క్’లు.. ఉచితం !
కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాస్క్ లని తప్పనిసరి చేసింది. అంతేకాదు.. ఆ మాస్క్ లని ప్రభుత్వమే ఉచితంగా పంచాలని నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణా చర్యలపై సీఎం జగన్ ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరుయ్యారు.
రాష్ట్రంలోని 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. వీలైనంత త్వరగా మాస్క్ లు పంపిణీ చేయాలన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా మాస్క్ లని తప్పనిసరి చేసింది. ప్రభుత్వమే ఉచితంగా మాస్క్ లని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఏపీ కూడా అదే దారిలో మాస్క్ లని ఉచితంగా పంచాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో మాస్క్ లు మస్ట్.. మరియు అవి ఉచితం.