‘ఆర్ఆర్ఆర్’ రన్ టైం లీకు
ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ యేడాది జులై 30న రావాల్సిన ఆర్ఆర్ఆర్ కొన్ని కారణాల వలన వచ్చే యేడాది జనవరి 8కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ తో ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ ఉండదని నిర్మాత డివివి దానయ్య క్లారిటీ ఇచ్చారు.
ఎందుకంటే ? ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ 80 శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని పూణెలో చిత్రీకరించాల్సి ఉంది. ఈ షెడ్యూలో అలియా భట్ పాల్గొననున్నారు. కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా పడింది. ఆ ప్రభావం తగ్గాక తిరిగి షూటింగ్ మొదలు కానుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ ఆర్ ఆర్ మరోసారి వాయిదాపడే ఛాన్స్ లేదని తెలిపారు.
మరో న్యూస్ ఏంటంటే ? ఆర్ఆర్ఆర్ రన్ టైం దాదాపు 3గంటలు ఉండనుందట. బాహుబలి 2 రన్ టైం 2 గంటల 51 నిమిషాలు. ఇప్పుడు దీనిని మంచి ఆర్ఆర్ఆర్ ఉంటుంది. దాదాపు 3గంటల రన్ టైం తో ఆర్ ఆర్ ఆర్ రాబోతుందని చెబుతున్నారు. కథ-కథాఅలు గిప్పింగ్ గా ఉంటే ప్రేక్షకులు 3గంటల సినిమాని కూడా ఆస్వాదిస్తారన్నది జక్కన్న భావనలా కనిపిస్తోంది.