అలర్ట్ : సామాజిక దూరం 8 అడుగులు ఉండాల్సిందే

కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి సోకిన మనిషికి దగ్గర ఉండి, సన్నిహితంగా మెలిగేతేనే సంక్రమిస్తుందని చెబుతున్నారు. అందుకే సామాజిక దూరం పాటించడం ద్వారా దీని బారి నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే తాజా అధ్యయనం ప్రకారం ఈ వైరస్ గాల్లోనూ వ్యాప్తిస్తోందని తేలింది.

ఈ మేరకు చైనా బీజింగ్ లోని అకాడమీ ఆఫ్‌ మిలిటరీ మెడికల్ సైన్స్‌కు చెందిన పరిశోధకులు పరిశోధనల్లో తేలిందని చెబుతున్నారు. వుహాన్‌లోని ఓ ఆస్పత్రిలో కొవిడ్‌ జనరల్‌, ICU నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. ఈ విషయం తేలినట్టు చెబుతున్నారు. కరోనా సోకిన పేషెంట్ల నుంచి వైరస్‌ 13 అడుగుల వరకు ఈ వైరస్ వ్యాపిస్తోంది. అంతేకాదు.. గాలిలోనూ ఈ వైరస్ కొంతదూరం వ్యాపిస్తోందని తెలిపారు. సోషల్ డిస్టాన్స్‌లో కనీసం 8 అడుగుల దూరం ఉంటే బెటర్ అని తాజా అధ్యయనంలో తేలింది.