స్మార్ట్ లాక్ డౌన్ ప్లాన్ చేసిన కేంద్రం

దేశంలో లాక్ డౌన్ పొడగింపు ఖరారైంది. మరో రెండు వారాలపాటు లాక్ డౌన్ కొనసాగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10 గంటకి ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ సందర్బంగా లాక్ డౌన్ పై ప్రకటన చేయనున్నారు. అయితే కేంద్రం స్మార్ట్ లాక్ డౌన్ ప్లాన్ చేసినట్టు సమాచారమ్. ఇందులో భాగంగా దేశాన్ని మూడు జోన్లుగా విభజించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

రెడ్ జోన్, ఆరేంజ్ జోన్, గ్రీన్ జోన్లుగా విభజిస్తారు. 15 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాన్ని రెడ్ జోన్ గా, 15 కంటే తక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాన్ని ఆరేంజ్ జోన్ గా, అసలు కరోనా కేసులు నమోదు కానీ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించనున్నారు. రెడ్ జోన్ లో లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేస్తారు. ఈ ప్రాంతంలో ప్రజలకి అన్నీ డోర్ డెలవరీ అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక ఆరేంజ్ జోన్ లో కొన్ని సడలింపులు ఉంటాయ్. గ్రీన్ జోన్ లో ఎలాంటి ఆంక్షలు ఉండవని చెబుతున్నారు.