కేసీఆర్ కరోనా యాడ్.. సూపర్ !


స్టార్ హీరోలని మించిన క్రేజ్ సీఎం కేసీఆర్ సొంతం. ఆయన ఒక్క పిలుపుతో తెలంగాణ ప్రజానీకం అంతా కదిలింది. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడింది. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎన్నో పిలుపులిచ్చారు. వాటిని తెలంగాణ ప్రజానీకం విజయవంతం చేసింది. ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయింది. తాజాగా సీఎం కేసీఆర్ మరో పిలుపునిచ్చారు. అదే కరోనా పిలుపు.

మహమ్మారి కరోనాకి మందు లేదు. ముందు జాగ్రత్త చర్యలు పాటించడం ఒక్కటే శరణ్యం. సామాజిక దూరం, పరిశుభ్రత, మాస్క్ లని ధరించడం ద్వారా.. కరోనాని మన దరికి చేరకుండా జాగ్రత్తపడవచ్చు. తాజాగా సీఎం కేసీఆర్ ఈ జాగ్రత్త పడుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోలని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సరదాగా సీఎం కేసీఆర్ కరోనా యాడ్ సూపర్ అంటున్నారు.