జడ్డూ కత్తి విన్యాసం.. సూపర్ ! 

బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అద్భుత విన్యాసాలు చేస్తుంటాడు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. సహజంగా మైదానంలో మంచి పరుగులు చేసినప్పుడు జడ్డూ తన బ్యాట్‌ను కత్తి తిప్పినట్లు తిప్పడం మనం ఎన్నోసార్లు చూశాం. ప్రస్తుతం లాక్ డౌన్ తో హోం క్వారంటైన్ లో ఉన్న జడ్డూ.. నిజమైన కత్తితో ప్రదర్శన చేశాడు.

ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ‘కత్తి తన మెరుపును కోల్పోవచ్చు కానీ, గురువు మాటను కాదనదు’ అని పేర్కొన్నాడు. దీనికి తాజా, మాజీ క్రికెటర్లు, క్రికెట్ అభిమనులు ఫిదా అవుతున్నారు. మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ పై ఈరోజు అప్ డేట్ ఇస్తానని బీసీసీ బాస్ గంగూలీ తెలిపిన సంగతి తెలిసిందే.