వలస కూలీల శిబిరాలను సందర్శించిన కేటీఆర్

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలని తెలంగాణ ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. వారిని తమ బిడ్డలుగానే భావిస్తామని.. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వలస కూలీలకి ఒక్కొక్కరి 12కిలోల చెప్పున రేషన్ బియ్యం అందించారు. ఒక్కోక్కరికి రూ. 500 చొప్పున డబ్బులు ఇచ్చారు.

వలస కూలీల కోసం శిబిరాలు ఏర్పాటు చేసి.. ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని వలస కూలీల శిబిరాలను మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. వారి పరిస్థితులు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆహారం, రేషన్‌ సరకుల లబ్ధిపై వాకబు చేశారు. త్వరలోనే ఈ సంక్షోభం తొలగిపోతుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బయటకు వెళ్లకుండా ఏర్పాటు చేసిన వసతుల్లోనే ఉండాలని వలస కూలీలకు సూచించారు. ప్రస్తుతం తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వారు కేటీఆర్‌కు తెలిపారు.