నిరాశలో నిఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దానికి కారణం లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగించడమే. దేశంలో కరోనా ఇంకా కంట్రోల్ లోకి రాని నేపథ్యంలో మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడగించాలని కేంద్రం నిర్ణయించింది. దీనిపై రేపు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయనున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో లాక్ డౌన్ ని రెండువారాల పాటు పొడగిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో హీరో నిఖిల్ నిరాశ చెందారు.

నిఖిల్ పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. అంతా బాగుంటే ఈ నెలలోనే పెళ్లి జరగాల్సి ఉంది. కరోనా కారణంగా నిఖిల్ తో పాటు నితిన్ పెళ్లి వాయిదా పడింది. కరోనా ప్రభావం తగ్గగానే పెళ్లి చేసేసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. ఈ ఇద్దరు యంగ్ హీరోలు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ పొడగించడంతో నిఖిల్ తన నిరాశని ట్విట్టర్ వేదిగా చూపించారు. ఆ మూడుకి కరెక్ట్ గా సూటయ్యే ఓ ఫోటోని షేర్ చేశారు. బహుశా.. నితిన్ మూడు కూడా ఇదేనేమో.. !