విదేశాల్లో చిక్కుకుపోయిన వారిపై సుప్రీం తీర్పు
మహమ్మారి కరోనాకు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. వివిధ అవసరాల నిమిత్తం విదేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారందరినీ స్వదేశానికి తీసుకురావాలంటూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడివారు అక్కడే ఉండటం మేలని అభిప్రాయపడింది.
ఇప్పుడు విదేశాల్లో ఉన్న వారిని తీసుకురమ్మని కేంద్రానికి చెప్పలేమని సుప్రీం అంది. అయితే విదేశాల్లోని భారతీయుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు అమెరికాలోని విదేశీయులని ఆయా దేశాలు తీసుకెళ్లాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. లేని యెడల అమెరికాను వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.