హీరోయిన్ భర్తకి కరోనా

మహమ్మారి కరోనాకి సామాన్యుడు సెలబ్రిటీ అనే తేడానే లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఒకరిద్దరు మృతి చెందారు కూడా. సీనియర్ హీరోయిన్ శ్రియ భర్త అండ్రీ కొచ్చిన్‌ కి కూడా కరోనా సోకింది. ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్తకి కరోనా సోకిందని శ్రియ తెలిపింది.

ఆండ్రీకి పొడి ద‌గ్గు, జ్వ‌రం ఉన్నాయి. క‌రోనా వైర‌స్‌కి సంబంధించిన భ‌యంక‌ర‌మైన ల‌క్ష‌ణాలు  రెండు ఉండ‌డంతో  వెంట‌నే ఆండ్రీని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్య సిబ్బంది చికిత్స‌లు చేసి కొద్ది రోజుల పాటు ఇంట్లో ఒంట‌రిగా ఉండ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. దేవుడి ద‌య వ‌ల‌న అత‌ను ఇప్పుడు బాగానే ఉన్నాడని శ్రియ చెప్పుకొచ్చింది.