రూ. 1500.. నేడు పేదల బ్యాంకు ఖాతాల్లోకి !

కరోనా విజృంభిస్తున్న కఠన సమయాన పేదలని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పేదలు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీతో పాటు, రూ. 1500 ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే రేషన్ బియ్యం పంపిణీ జరిగింది. ఈరోజు పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.1500 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.

పేదల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1500 చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది. దీని కోసం రూ.1,112 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులకు బదిలీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు పేదలకు సాయం అందిస్తున్నారని కేటీఆర్ ట్విటర్ లో పేర్కొన్నారు. మరోవైపు పేదలు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ 87 శాతం మందికి పూర్తయిందని కేటీఆర్  చెప్పారు. 76 లక్షల రేషన్ కార్డుదారులకు మూడు లక్షల టన్నులకుపైగా బియ్యం విజయవంతంగా చేరిందని తెలిపారు.