లోకల్ టాక్ తెలుసుకుంటున్న కేటీఆర్
అంతా బాగుందని భుజాలు తడుముకోవడం కాదు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడమే ముఖ్యం. ఇప్పుడు మంత్రి కేటీఆర్ అదే చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న కఠిన సమయాన కేటీఆర్ ఇంట్లో కూర్చోవడం లేదు. నేరుగా వలస కూలీల దగ్గర వెళ్లి వారి పరిస్థితులని గురించి తెలుసుకొన్నారు. వారు బాగున్నారని తెలుసుకొని సంతోషించారు.
ఇక బుధవారం మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ముస్తాబాద్ మండలం గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ తనిఖీ చేశారు. ఆ తర్వాత వేములవాడలో కంటైన్‌మెంట్ ప్రాంతంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పలుచోట్ల స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరోనాకు ఒక ఫార్ములా అంటూ లేదు. సోకకుండా చూసుకోవడమే మేలు. కరోనా నివారణకు స్వీయ నియంత్రణే మందు. రానున్న రెండు వారాలు కూడా ప్రజలు సహకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.