మంచువారి ప్రయోగం :  కొబ్బరి బొండాలో చికెన్ రైస్ !


కరోనా లాక్ డౌన్ తో సినీ తారలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇంట్లో ఉంటూ నచ్చిన పనులు చేసుకుంటున్నారు. కొత్త పనులు ట్రై చేస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ కొబ్బరి బొండాలో చికిన్ రైస్ వండారు. దానికి సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

“కొత్తగా ఏదైనా వండాలని ప్రయత్నించా. కొబ్బరి బొండాంలో రైస్, చికెన్ పెట్టి వండా. ఈసారి లాక్ డౌన్ పూర్తయితే, నేను చెఫ్ గా మారి, అనేక పేటెంట్ లను ఫైల్ చేస్తా”నని విష్ణు రాసుకొచ్చారు.