కరోనాపై సీతమ్మ మాట

కరోనా బీభత్సం.. శ్రీరాముడు సీతమ్మకు పెట్టిన అగ్నిపరీక్ష లాంటివని అన్నారు రీల్ సీతమ్మ. ‘రామాయణం’ ధారావాహికలో సీత పాత్ర పోషించిన దీపికా చిఖాలియా కరోనా లాక్‌డౌన్‌ పై స్పందించారు. లాక్‌డౌన్‌ పొడిగింపును ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. లాక్‌డౌన్‌ కు మద్దతు తెలుపుతూ..  దీపికా ఓ వీడియో మెసేజ్ ని తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

‘కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఆయన చెప్పినట్లు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోనే ఉండండి. రోగనిరోధక శక్తిని పెంచుకోండి. అలాగే మన ఇంట్లో ఉండే పెద్దవయసు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు పాటించండి. ప్రస్తుతం మన ఎదుర్కొంటున్న కరోనా క్లిష్ట పరిస్థుతులనేవి రామాయణంలో ‘అగ్నిపరీక్ష’ లాంటిది. లాక్‌డౌన్‌ అనేది ‘లక్ష్మణ రేఖ’తో సమానం. కాబట్టి ‘లక్ష్మణరేఖ’ను ఎవరూ దాటకండి. ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌ను పాటించి.. ఇంట్లోనే ఉండండి. అలాగే రాత్రి పగలు అనే తేడా లేకుండా మన కష్టపడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర సిబ్బందికి ధన్యవాదాలు’ రీల్ సీతమ్మ తెలిపారు.