పవన్ సరసన ఇలియాన.. ఫిక్స్ !

హీరోయిన్ ఇలియానా పంట పండింది. ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలింది ఇల్లీ. తెలుగులో తొలి కోటి అందుకున్న హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. ఇక్కడ ఫుల్ ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ పర్వాలేదనిపించింది. కానీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. బాలీవుడ్ లో ఆఫర్స్ లేకపోవడంతో తిరిగి టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ ‘అమర్ అక్భర్ ఆంథోనీ”లో నటించింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో ఇల్లీకి మరో ఆఫర్ రాలేదు.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్ కోసం పోటీ పడినా.. నెగ్గలేదు. దీంతో నిరాశలో ఉన్న ఇల్లీకి బంపర్ ఆఫర్ వచ్చిపడింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ చిత్రం ‘వకీల్ సాబ్’లో హీరోయిన్ గా ఎంపికైంది. ముందుగా ఈ సినిమా కోసం శృతిహాసన్ ని అనుకున్నారు. ఏమైందో ఏమోగానీ.. వకీల్ సాబ్ లో నటించలేదని ఇటీవలే శృతి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె స్థానంలో ఇల్లీని తీసుకున్నారు. అసలే ఆపర్లు లేని ఇల్లీకి ఇది బంఫర్ ఆఫర్ అనే చెప్పాలి.