లాక్‌డౌన్‌ మరింత కఠినంగా

దేశంలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే దేశంలో 941 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. ఈ నేపథ్యంలో కరోనా లాక్‌డౌన్‌ ని మరింత కఠినంగా అమలు చేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఈ మేరకు రాష్ఠ్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఏప్రిల్ 20 తర్వాత గ్రీన్‌ జోన్‌ ప్రాంతాల్లో కొన్ని రంగాలకు వెసులుబాటు కల్పించేందుకు అవకాశాలున్నాయన్నారు. వలస కూలీలు, కార్మికులకు ఆహారం, వసతి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇక దేశంలో ఇప్పటి వరకు 12,380 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 414 మంది మృతి చెందారు. 1489 మంది కరోనా నుంచి కోలుకున్నారు.