నితిన్, కల్యాణ్ లని ఓ రేంజ్ లో వేసుకున్న మంచు విష్ణు

నితిన్, కల్యాణ్ రామ్ లని రాస్కెల్స్ అనేశాడు మంచు విష్ణు. సుమంత్ ని వదల్లేదు. కనిపిస్తే పీకపిసికేస్తానని వార్నింగ్ ఇచ్చేశాడు. గోపీచంద్ పై ఫైర్ అయ్యాడు. ఇంతకీ.. వీరిపై మంచి విష్ణు ఎందుకు పడిపోయినట్టు ? అంటే.. వీరద్దరూ మంచి స్నేహితులు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మంచు మనోజ్ నితిన్, కల్యాణ్ రామ్ రాస్కెల్స్.. వారు నా మాట వినడం లేదన్నారు.

నితిన్, కళ్యాణ్ రామ్‌ లతో మల్టీస్టారర్ సినిమాలు చేద్దామని ఇప్పటికే విష్ణు నాలుగుసార్లు ఆఫర్ చేశాడట. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ‘మోసగాళ్ళు’ సినిమాలో నటించమని సమంత్ ని అడిగా. ఆ క్యారెక్టర్ నచ్చలేదనే కారణం చెప్పి తప్పించుకున్నాడు. సుమంత్ ఎక్కడైనా కనిపిస్తే గొంతు పిసికేస్తా. ‘ఈడో రకం ఆడో రకం’ సినిమా కోసం మొదట కళ్యాణ్ రామ్‌నే అనుకున్నాం. అతను కాదని అంటే వేరే హీరోని తీసుకున్నామని విష్ణు చెప్పుకొచ్చాడు.