‘ఆర్ఆర్ఆర్’పై నవదీప్ క్లారిటీ

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కరోనా ఎఫెక్ట్ తో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి రోజుకోవార్త షికారు చేస్తోంది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తమిళ్ స్టార్ విజయ్ కూడా మెరవనున్నారనే ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ని ఆర్ ఆర్ ఆర్ కోసం తీసుకొన్నారని చెప్పుకొంటున్నారు.

తాజాగా ఈ ప్రచారంపై నవదీప్ స్పందించారు. “నేను ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నాంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదు. అలాంటి ఆఫర్ నాకు రాలేదు” అని క్లారిటీ ఇచ్చారు. ఇక మోహన్ లాల్, విజయ్ ఆర్ ఆర్ ఆర్ లో కనిపించేది నిజమేనా ? అన్నదానిపై క్లారిటీ రావాల్సివుంది.

తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్య ఉన్న ఓ కామన్ పాయింట్ ఆధారంగా ఈ కథని రెడీ చేశారు రాజమౌళి. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, ఆయనకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఇక కొమరం భీమ్ గా ఎన్టీఆర్, ఆయనకి జోడిగా హాలీవుడ్ బ్యూటీ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. వచ్చే యేడాది జనవరి 8న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.