కరోనా సాయంపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పేద ప్రజలని ఆడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం మరియు 1500 రూపాయల నగదు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రజలకి రేషన్ బియ్యం అందాయి. నగదు రూ. 1500 బుధవారం ఖాతాల్లో పడ్దాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ యంత్రాంగం ప్రజలని అలర్ట్ చేసింది.
కరోనా డబ్బులని సైబర్ నేరగాళ్లు కాజేయకుండా.. ప్రజలని అలర్ట్ చేసింది. స్వయంగా ఎవరన్నా ఫోన్ చేసి ప్రభుత్వం తరుపున 1500 రూపాయలు మీ ఖాతాలో పడ్డాయని.. అకౌంట్ డీటెయిల్స్ మరియు ఓటీపీ చెప్పమని అడిగితే చెప్పవద్దని తెలిపారు. అలా చెప్పినట్లైతే తమ ఖాతానుండి నేరగాళ్లు డబ్బులు హరిస్తారని తెలియజేశారు. సైబర్ నేరగాళ్ళనుండి జాగరఃతగా ఉండాలని హెచ్చరించారు.