కరోనా నుంచి కోలుకున్న రాష్ట్రం

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో అరుణాచల్ ప్రదేష్ కరోనా ఫ్రీ అయింది. ఆ రాష్ట్రంలో నమోదైన ఏకైక కరోనా పాజిటివ్ కేసు.. ఇపుడు నెగెటివ్ గా నిర్దారణ అయింది. కరోనా పాజిటివ్ వ్యక్తికి రెండో సారి పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. 

ఆ తర్వాత 3, 4వ సారి కూడా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులేవి లేవని ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.