నిఖిల్ పెళ్లిపై గరం గరం
కరోనా ఎఫెక్ట్ తో సామాన్యుల నుంచి సెలబ్రిటీల పెళ్లిళ్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్ లు కూడా ఉన్నారు. అయితే కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ మాత్రం కరోనా తగ్గుముఖం అయ్యేదాక ఆగలేకపోయాడు. ఈ ఉదయం బెంగళూరు సమీపంలోని రామనగర్ ఫాం హౌజ్‌లో నిఖిల్-రేవతిల వివాహం జరిగింది.
కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. దాదాపు 60 మంది మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటికొచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వీటిలో లాక్‌డౌన్ రూల్స్ పాటించినట్టు కనిపించలేదు. ఎవరు మోహానికి మాస్క్ లు ధరించలేదు. సామాజిక దూరం అస్సలు పాటించలేదు. ఈ నేపథ్యంలో నిఖిల్ పెళ్లిపై పలువురు ప్రముఖులు ఫైర్ అవుతున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం నిఖిల్ పై గరం గరం అవుతున్నారు.
Wedding is more important than lockdown afterall! #Nikhilkumaraswamy pic.twitter.com/D0Rrfuj4dj
— Shivangi Thakur (@thakur_shivangi) April 17, 2020