పోలీసుల కరోనా విరాళం రూ. 3కోట్లు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈ కఠిన సమయాన పోలీసులు, వైద్యులు ప్రత్యక్ష దేవుళ్లుగా కనిపిస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో ప్రాణాలని లెక్క చేయకుండా విధులని నిర్వహించడమే కాదు. తమవంతుగా కరోనా విరాళం ప్రకటించారు ఉత్తరాఖండ్ పోలీసులు కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వానికి తమ వంతుగా రూ.3 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.  

ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తామని డీజీ అశోక్‌ కుమార్‌ ప్రకటించారు. దీనికోసం గెజిట్‌ పోలీసు అధికారులు మూడు రోజుల వేతనాన్ని, నాన్‌ గెజిటెడ్‌ పోలీస్‌ అధికారులు ఒక్క రోజు వేతనాన్ని అందించారని తెలిపారు. ఇప్పటి వరకు ఉత్తరాఖండ్‌లో 37 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్.