లాక్‌డౌన్‌ సడిలింపుపై కేసీఆర్ సమీక్ష

దేశంలో మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. అయితే ఈ నెల 20 నుంచి లాక్‌డౌన్‌ నుంచి కొన్ని రంగాలకి సడిలింపు  ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు గైడ్ లైన్స్ ని కేంద్రం రాష్ట్రాలకి పంపింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి కొత్త గైడ్ లైన్స్ ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదని సమాచారమ్. ఈ నెల 20 తర్వాత కూడా పాత లాక్‌డౌన్‌ నిబంధనలే అమలు చేయాలని, ఎప్పటిలాగే లాక్‌డౌన్‌ ని కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారమ్.

ఈ నేపథ్యంలో తొలి విడత లాక్‌డౌన్‌లో అమలు చేసిన నిబంధనలే రెండో విడతలో ఉంటాయని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్ ఈ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయాలు ఉంటాయని సీపీ తెలిపారు. లాక్‌డౌన్‌ సడిలింపుపై మంత్రివర్గం ఆదివారం నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సీఎం కేసీఆర్  రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.