24గంటల్లో.. 991 కరోనా కేసులు, 43 మంది మృతి !
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాదాపు వెయ్యి కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 991 కొత్త కేసులు నమోదు కాగా, 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378కి చేరింది. మృతుల సంఖ్య 480కి చేరింది.
‘దేశవ్యాప్తంగా కొన్నిజిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా 11 జిల్లాల్లో 2 వారాలుగా కొత్త కేసులు నమోదు కాలేదు. కరోనా బాధితుల్లో మరణాల రేటు 3.3శాతం మాత్రమే. మృతుల్లో 14శాతం 45 ఏళ్లు పైబడిన వారు. 70శాతానికి పైగా మరణాలు 70ఏళ్లు పైబడిన వారే. సామాజిక దూరం అమలు విషయంలో రాష్ట్రాలు ఎక్కువ బాధ్యత వహించాలి. హాట్స్పాట్ ప్రాంతాల్లోని వారికి ర్యాపిడ్ టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేయాలని’ కేంద్రం పేర్కొంది.
#WATCH Positive trend noted in 47 dists of 23 states. No positive case reported in last 28 days in Mahe of Puducherry,&Kodagu of Karnataka. In 45 other dists,no new positive case reported in last 14 days-22 dists in addition to those mentioned earlier:Lav Aggarwal,Health Ministry pic.twitter.com/2uL7rqN2rT
— ANI (@ANI) April 18, 2020