హాట్ స్పాట్ లో ఇవాంక పండగ చేసుకుంది

అమెరికాలో కరోనా వైరస్ అత్యంత ఎక్కువగా విస్తరిస్తున్న హాట్ స్పాట్ లలో న్యూజెర్సీ ఒకటి. ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక తన భర్త, కుటుంబ సభ్యులతో కలిసి వాషింగ్టన్ నుంచి న్యూజెర్సీకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఇంట్లో ఉండే అదృష్టం ఉన్నవారంతా దయచేసి ఇంట్లోనే ఉండండి అని ప్రజలకు పదే పదే పిలుపునిచ్చిన ఇవాంక… పండగ నిమిత్తం న్యూజెర్సీకి వెళ్లడం విమర్శలకి దారితీస్తోంది.

యూదుల పండుగ పాసోవర్ (తెలుగులో పస్కా)లో పాల్గొనేందుకని ఆమె కొద్దిరోజుల కిందట అక్కడకు వెళ్లారని శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. న్యూజెర్సీలోని బెడ్ మినిస్టర్ లో జరిగిన పాసోవర్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఇవాంక పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడి నుంచే ఇవాంక విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త కుష్నెర్ మాత్రం అధ్యక్షునికి సహాయపడేందుకు శ్వేతసౌధానికి తిరిగి వచ్చారు.