పవన్ తో మాస్ స్టెప్పులు వేయిస్తా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సింపుల్ మాస్ స్టెప్పులు వేయిస్తా అంటున్నాడు జానీ మాస్టర్. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో సినీతారలు ఇంటికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఇంటికే పరిమితమైన జానీ మాస్టర్ తాజాగా ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీలలో మీ అభిమాన డ్యాన్సర్ ఎవరు ? అని అడగగా.. ముగ్గురు ఇష్టమేనని సమాధానం ఇచ్చారు జానీ మాస్టర్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సింపుల్ మాస్ స్టెపులు వేయించమని ఓ నెటిజన్ అడగగా.. నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నానన్నారు. వకీల్ సాబ్ కోసం పని చేస్తున్నారా ? అంటే.. ఈ సినిమాలో పాటలకి ఛాన్స్ లేకపోవచ్చన్నారు. ఇక సమంత నా కుటుంబ సభ్యురాలు లాంటిదన్నారు. జానీ సినిమా అంటే ఇష్టమని సమాధానం ఇచ్చారు.