విక్రమ్ కర్ణుడు లుక్

ఆర్‌.ఎస్‌. విమల్‌ దర్శకత్వంలో చినాయ్ విక్రమ్ నటిస్తున్న చిత్రం ‘మహావీర్ కర్ణ’. తమిళంతో పాటు వివిధ భాషల్లో రూపొందిస్తున్నారు. న్యూయార్క్‌కు చెందిన నిర్మాణ సంస్థ యునైటెడ్‌ ఫిల్మ్‌ కింగ్‌డమ్‌ నిర్మిస్తోంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో భారీగా ఈ సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

శనివారం విక్రమ్ బర్త్ డే కానుకగా ‘మహావీర్ కర్ణ’ మేకింగ్ బిట్ సీన్ ఒకటి విడుదల చేశారు. ఇందులో విక్రమ్ బాణం ఎక్కుపెడుతూ కనిపించారు. కర్ణుడి గెటప్‌లో విక్రమ్ యోధుడిలా దర్శనమిచ్చారు. ఇక సురేష్‌ గోపీ దుర్యోధనుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో మిగిలిన నటీనటుల వివరాలు వెల్లడించాల్సి ఉంది.