ఏపీలో లాక్ డౌన్ సడలింపులు ఇవే !
మే 3 వరకు కేంద్రం లాక్ డౌన్ పొడగించిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 20 నుంచి లాక్ డౌన్ నుంచే కొన్ని సడలింపులు కల్పించనున్నారు. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ని ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకి పంపింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులపై ఓ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ కొత్త గైడ్ లైన్స్ ని రిలీజ్ చేసింది.
* రైస్, పప్పు మిల్లులు, పిండిమరలు, డైరీ ఉత్పత్తుల పరిశ్రమలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు
* సబ్బులు తయారీ కంపెనీలు, ఔషద తయారీ సంస్థలు, మాస్కులు, బాడీ సూట్ల తయారీ సంస్థలకు మినహాయింపు
* కోల్డ్ స్టోరేజీలు, ఆగ్రో ఇండస్ట్రీస్, బేకరీ, చాక్లెట్ల తయారీ పరిశ్రమలకు మినహాయింపు
* అమెజాన్, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ కార్యకలాపాలకు సడలింపు
* ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎగుమతుల యూనిట్లకు మినహాయింపు
* ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమలు పనిచేసేందుకు అవకాశం
* ఐస్ ప్లాంట్లు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.